: మీ సేవలు మరువలేం: వాయుసేన అధికారులకు ఘన నివాళి


ఉత్తరాఖండ్ బాధితులకు ఆపన్న హస్తం అందించే క్రమంలో తిరిగిరాని లోకాలకు ఎగసిన అధికారులకు భారతీయ వాయుసేన నేడు ఘనంగా నివాళులర్పించింది. అకాల మరణం పాలైన ఆ అధికారులు తమ మార్గదర్శకులని వాయుసేన వేనోళ్ళ కీర్తించింది. వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎంఐ-17 హెలికాప్టర్ నిన్న గౌరీకుండ్ వద్ద కూలిపోయిన సంగతి తెలిసిందే. ప్రతికూల వాతావరణం కారణంగా ఆ హెలికాప్టర్ నేలకొరగడంతో.. అందులో ప్రయాణిస్తున్న వాయుసేన, సైనిక అధికారులతోపాటు పలువురు యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది చనిపోగా, వారిలో ఐదుగురు వాయుసేన అధికారులున్నారు. వారికి ఈ రోజు గౌచర్ బేస్ వద్ద అంజలి ఘటించారు.

  • Loading...

More Telugu News