: కేరళ రాజకుటుంబానికి రూ.2,500 పెన్షన్
బ్రిటీష్ పాలనకు ముందు ఉత్తర కేరళలోని మలబార్ తీరాన్ని పాలించిన జమోరియన్ రాజ కుటుంబానికి పెన్షన్ ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కుటుంబంలో ఇప్పుడున్న సభ్యులందరికీ నెలకు 2,500 రూపాయలను ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ అనంతరం కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఈ ప్రకటన చేశారు. రాజకుటుంబానికి చెందిన వారిలో ప్రస్తుతం 826 మంది ఉన్నట్లు తేలింది. వీరందరికీ ఇక నుంచి పెన్షన్లు అందుతాయి.