: వరద బాధితులను ఇళ్లకు చేర్చడంలో బాబే ఫస్ట్
ఉత్తరాఖండ్ వరదబాధితులను ఇళ్లకు చేర్చడంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేశారు. వరదలు ఉత్తరాఖండ్ ను అతలాకుతలం చెయ్యగానే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ వరద ప్రాంతాల్లో కలియతిరిగి వందలాది వాహనాలను సమకూర్చి తమ రాష్ట్రవాసులను రక్షించడంలో కీలకపాత్ర పోషించి సర్వత్ర ప్రశంసలు అందుకున్నారు. ఆయన తరువాత లేటుగా ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు తన సమర్థతను చాటుతూ, ఆంధ్రులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం కంటే పదడుగులు ముందున్నారు.
ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేస్తున్నా తన చిత్తశుద్దిని చాటుకుంటూ మరోసారి డెహ్రాడూన్ పయనమయ్యారు. తాను వెళ్తున్న విమానంలోనే తెలుగువారిని హైదరాబాద్ కు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈసారి మాత్రం బాధిత తెలుగు యాత్రీకులనందరినీ గమ్యస్థానాలకు చేర్చేవరకూ బాబు డెహ్రాడూన్ లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.