: చిన్న పరిశ్రమలకు గూగుల్ చేయూత
చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రచారం కల్పించేందుకు గూగుల్ సంస్థ ప్రీమియర్ ఎన్ఎంఈ పార్టనర్ పేరిట ఓ కార్యక్రమాన్ని ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా దక్షిణ భారత దేశంలోని తమిళనాడు, కర్ణాటకతో పాటు మన రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రచారం కల్పిస్తుంది. డిజిటల్ ప్రచారం ద్వారా పరిశ్రమల్లో ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కలిగే అవకాశం ఉందని గూగుల్ ప్రతినిధి టాడ్ రోవే తెలిపారు. ఇది ఇప్పటికే మిగిలిన రాష్ట్రాల్లో విజయవంతమైందని ఆయన అన్నారు. ప్రచారం కోరుకునే పరిశ్రమలు, సంస్థలకు గూగుల్ సంస్థ మార్కెటింగ్, టెక్నికల్, ఆపరేషనల్, అకౌంటింగ్ సహాయాలను అందిస్తుందని టాడ్ రోవే అన్నారు.