: వాళ్లు మీసాల వీరులు: రణ్వీర్
మెలితిప్పిన మీసాలతో శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా ఇంగ్లండ్ లో జరిగిన చాంపియన్ ట్రోఫీలో అద్భుతంగా రాణించారని బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ అభిప్రాయపడ్డాడు. మీసాలు పెంచడంతోనే వీరికి అదృష్టం కలిసి వచ్చిందన్నాడు. తన మీసాలు కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశాడు. సోనాక్షి సిన్హాతో జంటగా నటించిన 'లూటెరా' సినిమా పోస్టర్ విడుదల కార్యక్రమంలో అతడు పాల్గొన్నాడు.