: ఐక్యమైన రాయలసీమ
బ్రాహ్మణి ఉక్కు రాయలసీమ హక్కు అంటూ రాయలసీమ రాజకీయ పక్షాలు నినదిస్తున్నాయి. రాయలసీమ స్థాయీ సదస్సు వేదికపై రాజకీయ, ప్రజాసంఘాలు ఐక్యమయ్యాయి. బ్రాహ్మణి ఉక్కుకోసం గత కొంత కాలంగా నిరసనలు, ఆందోళనలతో రాయలసీమ రాజకీయపార్టీలు ఉద్యమం చేస్తున్నాయి. 'కడప ఉక్కు రాయలసీమ హక్కు' అనే నినాదంతో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిన్న ప్రోద్దుటూరులోని పద్మశాలీయ కళ్యాణ మండపంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. విశాఖ ఉక్కుకంటే పది రెట్లు పెద్దదైన జమ్మలమడుగు ఉక్కు కర్మాగారాన్ని వైఎస్ నిర్మించ తలపెట్టారని, అయితే ఈ ప్రాంత నేతలకు చిత్తశుద్ది లేకపోవడంతో అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోయిందని, అది కార్యరూపం దాల్చితే 2 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.