: బాధితులను ఆదుకోవడంలో బాబు భేష్


ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు నాయుడు చూపిన చొరవ సర్వత్రా అభినందనలు అందుకుంటోంది. 'తెలుగోడికి తెలుగోడు అండ' అనే పద్దతిలో బాబు స్పందిస్తున్న తీరు అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. విమానం ఏర్పాటు చేయడం, వందమంది వైద్యులను తనతో తీసుకువెళ్లి వైద్య సేవలందించడం, బాబు ప్రతిష్ఠను అమాంతం పెంచేశాయి. తాజాగా బాబు బదరీనాథ్ లోని బాధితులతో ఫోన్లో మాట్లాడారు. అక్కడి తెలుగువారు స్వస్థలాలకు చేరుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముండడంతో వారు అనారోగ్యానికి గురైనట్టు గుర్తించి, పూర్తి వైద్య సేవలు అందించేందుకు ఇద్దరు వైద్యులతో కూడిన బృందాన్ని ప్రత్యేక హెలీకాప్టర్ లో పంపుతున్నట్టు తెలిపారు. బాధితుల్లో తెలుగువారు తీవ్ర వివక్షకు గురౌతున్నారని పలువురు ఆరోపిస్తున్న నేపధ్యంలో బాబు సేవల్ని అందరూ కొనియాడుతున్నారు.

  • Loading...

More Telugu News