: అత్యాచారానికి గురైన మరో చిన్నారి మృతి
మానభంగపర్వంలో మరో చిన్నారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ముంబైలో పది రూపాయల పనికోసం ఆశపడిన పదేళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. జూన్ 16 న పరిచితులైన నలుగురు యువకులు, ఒక పని చేసిపెడితే పది రూపాయలిస్తామని ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఎలాగోలా ఇల్లు చేరిన బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆ బాలిక మృతి చెందింది. ఈ ఘటనలో నిందితులంతా 13 నుంచి 16 ఏళ్ల లోపువారే. వారిలో ఇద్దరు అన్నదమ్ములు. నిందితులు నలుగుర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.