: పోలీసుల అదుపులో రూ..7 కోట్ల దొంగలు
రాజమండ్రిలో బ్యాంకు ఏటీఎంలలో డబ్బు నింపే కాంట్రాక్టు ఉద్యోగి శ్రీనివాస్ ని పాశవికంగా హత్యచేసి, 7.3 కోట్ల రూపాయలను దోచుకెళ్లిన ముఠాలోని ప్రధాన ముద్దాయితోపాటు మరో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఈ దాడిలో 11 మంది పాలు పంచుకున్నారని, మిగిలిన వారు ఒడిషా, బీహార్ లో తలదాచుకునే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. దోచుకున్న 7 కోట్ల 30 లక్షల రూపాయల్లో ఐదు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకోగా, మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకునేందుకు పోలీసులు వలపన్నినట్టు సమాచారం.