: ఫిక్సింగ్ హీరో శ్రీశాంత్ సినిమా ఎంట్రీ


మంచి క్రికెటర్ గా పేరు తెచ్చుకుని ఫిక్సింగ్ ఆరోపణలతో జైలు పాలై కెరీర్ ను ప్రశ్నార్థకంగా మార్చుకున్న శ్రీశాంత్ కు కష్టకాలంలోనూ లక్ పలకరించింది. ఫిక్సింగ్ పుణ్యమా అని శ్రీశాంత్ నటుడిగా మారిపోతున్నాడు. శ్రీశాంత్ కథానాయకుడిగా ఒక భారీ త్రిభాషా చిత్రాన్ని తీయడానికి ప్రముఖ దర్శకుడు బాలచంద్రకుమార్ రెడీ అయిపోయాడు. ఈ విషయాన్ని బాలచందర్ నిర్ధారించారు. ప్రకాష్ రాజ్, ప్రభుదేవాలు కూడా ఈ చిత్రంలో పాలుపంచుకోవడానికి అంగీకరించారని, దీన్ని ఇంగ్లండ్, చెన్నై, కోచి, దుబాయ్ లో చిత్రీకరిస్తామని చెప్పారు.

మలయాళం, తమిళంలో దీన్ని తీస్తామని, హిందీలోనూ తీయాలనుకుంటున్నామని తెలిపారు. శ్రీశాంత్ కేరళలో ప్రముఖ వ్యక్తి అని, ఫిక్సింగ్ కేసు ప్రభావం చిత్రంపై ఉండదన్నారు. దీనిపై శ్రీశాంత్ కుటుంబ సభ్యులు ఒకరు మాట్లాడుతూ చర్చలు నడుస్తున్నాయని చెప్పారు. శ్రీశాంత్ పాస్ పోర్టు కోర్టులో ఉన్నందున విదేశాలలో షూటింగ్ కు అవకాశం లేదన్నారు.

  • Loading...

More Telugu News