: శృంగార సైట్లపై ఉక్కుపాదం


అశ్లీల శృంగార వీడియోలు, ఫొటోలకు కేంద్రంగా నిలుస్తున్న విదేశీ వెబ్ సైట్లపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు వెబ్ సైట్లపై నిషేధం విధించగా.. తాజాగా పోర్నోగ్రఫీ కంటెంట్ షేర్ చేసుకోవడానికి వేదికగా ఉన్న సైట్లపై నిషేధ ఆజ్ఞలు విధించింది. 39 వెబ్ సైట్ చిరునామాలను(యూఆర్ఎల్) బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను టెలికాం శాఖ ఆదేశించింది.

ఈ 39 వెబ్ సైట్లలో అధిక శాతం వెబ్ ఫోరాలు. ఇందులో యూజర్లు ఇమేజ్ లను, పోర్నోగ్రఫీ సైట్ల అడ్రస్ లను షేర్ చేసుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. వీటిలో కొన్ని కేవలం ఫైల్, ఇమేజ్ స్టోరేజీ సైట్లు అని సమాచారం. ఈ సైట్లన్నీ విదేశాల నుంచి హోస్టింగ్ తీసుకున్నవే. ప్రస్తుతం దేశంలో చైల్డ్ పోర్నోగ్రఫీపై నిషేధం ఉంది. అడల్ట్ పోర్నోగ్రఫీ చూడడంపై నిషేధం లేదు.

  • Loading...

More Telugu News