: స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహిస్తాం: మంత్రి జానారెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం ఇచ్చిన తీర్పుతో వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి తెలిపారు. అయితే కొత్త పురపాలక, నగర పంచాయితీల ఏర్పాటువల్ల ప్రస్తుతం వున్నా వాటిలో 150 గ్రామ పంచాయితీలు తగ్గాయని ఆయన చెప్పారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన జానా, గతంలో అమలు చేసిన రిజర్వేషన్ విధానాన్నే ఇప్పుడూ అమలు చేస్తామని పేర్కొన్నారు.