: అమ్మ ఆకారానికి అంత్యక్రియలు
గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన తిప్పావఝుల మల్లేశ్వరి చార్దామ్ యాత్రకు వెళ్లి ఈ నెల 16న గల్లంతయ్యారు. ఆమెతోపాటు వెళ్లిన బంధువులంతా తరువాత తిరిగివచ్చి.. తమ కళ్లముందే మల్లేశ్వరి వరదలో కొట్టుకుపోయిందని చెప్పారు. తల్లి వస్తుందని ఎదురుచూసిన కుమారులు శివ, సతీష్ దీంతో తల్లికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు. పుల్లలతో స్త్రీ ఆకారంగా మలిచి, దానిని పిండితో ప్రతిమగా మలచి దానినే అమ్మగా భావించి అంత్యక్రియలు నిర్వహించారు.