: అది క్రికెట్ దిశ మార్చిన ఘటన: కపిల్ దేవ్
30 ఏళ్ల క్రితం తాము సాధించిన ప్రపంచకప్ దేశ క్రికెట్ దిశను మార్చిందని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. 1983లో అనామక జట్టుగా టోర్నీలో అడుగుపెట్టి నెంబర్ వన్ జట్టు వెస్టిండీస్ ను ఫైనల్లో మట్టికరిపించి ప్రపంచ కప్ ను కపిల్ దేవ్ జట్టు గెలుచుకుంది. నేటికి ఈ జట్టుకు 30 సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా కపిల్ మాట్లాడారు. 'మేం దేశానికి అందించిన తొలి ప్రపంచకప్ దేశంలో క్రికెట్ దిశను మార్చిందనడంలో సందేహం లేదు. గొప్ప మార్పును తీసుకొచ్చింది' అంటూ అభిప్రాయపడ్డారు కపిల్.