: మెట్రో రైల్ టిక్కెట్ల నిర్వహణ శాంసంగ్ సంస్థకు అప్పగింత


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టులో ఆన్ లైన్ టిక్కెట్ల నిర్వహణ బాధ్యతను ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ చేపట్టనుంది. ఈమేరకు మెట్రో రైల్  నిర్మాణ సంస్థ  ఎల్ అండ్ టి... శాంసంగ్ డేటా సిస్టమ్స్ మధ్య రూ. 200 కోట్ల ఒప్పందం ఖరారైంది.

తాజా ఒప్పందం ప్రకారం శాంసంగ్ సంస్థ.. స్మార్ట్ కార్డులు, టోకెన్లు, మొబైల్ ఫోన్ల ద్వారా టిక్కెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. కాగా, మెట్రో రైల్ వారం రోజుల పాసులు, నెల రోజుల పాసుల నిర్వహణ కూడా ఈ ఒప్పందంలో భాగంగా శాంసంగ్ డేటా సిస్టమ్స్ అంగీకరించింది. మెట్రో రైల్ స్మార్ట్ కార్డుతో బ్యాంకింగే కాకుండా మరో 15 రకాలు సేవలు కూడా నిర్వహంచుకునే వెసులుబాటు లభిస్తుంది.

  • Loading...

More Telugu News