: షుగర్‌ టెస్టులకు చుక్క నెత్తురు చాలు


శరీరంలో చక్కెర వ్యాధి అనేది ఇవాళ్టి రోజుల్లో సర్వసాధారణమైన విషయం అయిపోతోంది. చాలా మంది చాలాసార్లు చక్కెర పరీక్షలు చేయించుకునే అవసరం ఏర్పడుతోంది. అయితే ప్రతిసారీ సిరంజితో నెత్తురు తీసే ప్రక్రియ కాకుండా ఒక ఆధునిక విధానాన్ని అభివృద్ధి చేశారు. అన్ని వ్యాధుల నిర్ధారణకు ఒక బొట్టు రక్తం మాత్రం సరిపోయేలా అమెరికా శాస్త్రవేత్తలు ఒక చిప్‌ను డెవలప్‌ చేశారు. ప్రతిదానికీ రక్తమే అక్కర్లేదుట. శరీరానికి సంబంధించిన ఏ ద్రవమైనా సరే.. ఒక చుక్క ఇస్తే చాలునట. ఇది వ్యాధుల నిర్ధారణ చేసేస్తుంది.

ఒక చుక్క ద్రవాన్ని విశ్లేషించి.. అణువులోని జీవవిద్యుత్తు ధర్మాలను ఇది పసిగట్టేస్తుందిట. వ్యాధిగ్రస్థ అణువును కూడా పసిగడుతుంది. న్యూజెర్సీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రెజినాల్డ్‌ ఫారో, అలౌకిక్‌ కన్వాల్‌ నేతృత్వంలో దీన్ని రూపొందించారు. దీని రూపకల్పనలో ఓ భారతీయ సంతతి వైద్యుడు ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News