: అమర శిల్పి జక్కన కాలం నాటి విగ్రహం లభ్యం
అమరశిల్పి జక్కన కాలం నాటిదిగా భావిస్తున్న విగ్రహం తూర్పుగోదావరి జిల్లా కరప శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో లభించింది. ఈ ఆలయంలో 300 ఏళ్లనాటి అతి పురాతన మరకత విగ్రహాన్ని దేవాదాయ శాఖ ఉపస్తపతి ఏ రాజమహేంద్రన్ మంగళవారం గుర్తించారు. కాగా మరకత రాయితో తయారు చేసిన ఈ అపూర్వ విగ్రహం శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిగా నిర్ధారించారు. వెంటనే దానిని ఆలయంలో భద్రపరచాలని ఆలయపూజారులను ఆదేశించారు.