: సికింద్రాబాద్ అపోలో వైద్యుల ఇన్నోవేషన్ టెక్నిక్


గుండె నొప్పి బాధితులకు శుభవార్త. హార్ట్ అటాక్ పేషెంట్లకు చేస్తున్న తాజావిధానం కంటే అనువైన, సులువైన సర్జరీ పద్దతిని సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రి వైద్యులు కనుగొన్నారు. గుండె శస్త్రచికిత్సకు ప్రస్తుతమున్న యాంజియోప్లాస్టీ పద్దతికి విభిన్నమైన విధానాన్ని కనుగొన్నట్టు సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సాధారణంగా గుండెనొప్పి వచ్చినప్పుడు ఎల్ఏడీ ధమనిని క్లియర్ చేస్తారు వైద్యులు. అయితే, దీని వల్ల ఒక్కసారి పూర్తి స్థాయి ఫలితాలు రాకపోవచ్చు.

యాంజియోప్లాస్టీ ద్వారా ధమనుల్లో పూడిక, గడ్డకట్టిన రక్తాన్ని తొలగించినా 25 శాతం ఇబ్బందులు పునరావృతమౌతాయి. దీని వల్ల రోగికి తాత్కాలిక ఉపశమనం కలిగినా ఆర్నెళ్ల తరువాత మళ్లీ ఈ బ్లాక్స్ వచ్చే అవకాశముంది. అయితే మన అపోలో వైద్యులు కనుగొన్న విధానంతో ఇటువంటి బ్లాక్స్ ని పూర్తిగా నిరోధించవచ్చని ఈ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ జె.శివకుమార్ తెలిపారు.

ఈ విధానాన్ని క్లియర్ వే కాథెటర్ విధానంగా పిలుస్తారని, ఈ నెల 18 న అమెరికాలో జరిగిన సీ3 సమ్మిట్ లో 3000 మంది ప్రఖ్యాత కార్డియాలజిస్టుల ముందు ప్రత్యక్ష సర్జరీ ద్వారా వివరించామని ఆయన తెలిపారు. ఈ క్లియర్ వే కాథెటర్ విధానం తొలిసారి రాష్ట్రంలోనే వినియోగించామని జె.శివకుమార్ తెలిపారు.

  • Loading...

More Telugu News