: విశాఖలో మారణాయుధాలతో బెదిరిస్తున్న ముఠా అరెస్టు
విశాఖపట్టణంలో భూబకాసురులు పెరిగిపోతున్నారు. నగరంలోనూ, శివార్లలోనూ కబ్జాల పర్వం రాజ్యమేలుతోంది. దుండగులు మారణాయుధాలతో స్వైరవిహారం చేస్తున్నారు. కాస్త భూమి ఖాళీగా కన్పించినా కబ్జాకోరులు స్వాహా చేస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా మూడవ పట్టణ పోలీసు ఠాణా పరిధిలో ఓ భూయజమానిని బెదిరిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో వారు పోలీసులపై దాడికి తెగబడడంతో ఎస్ఐ, కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. వారిని అరెస్టు చేసి వారినుంచి రెండు తుపాకులు, రెండు కత్తులు, వేటకొడవళ్లు, యాసిడ్ ను స్వాధీనం చేసుకున్నారు.