: రేపు తెలంగాణ జిల్లాల్లో సీఎం పర్యటన


భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పంట నష్ట పోయిన రైతులను సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రేపు పరామర్శించనున్నారు. ఆదిలాబాద్ అందవెల్లిలో వర్షాలకు ఇల్లు కూలి మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని కూడా సీఎం పరామర్శిస్తారు. ఈమేరకు ముఖ్యమంత్రి రెండు జిల్లాల పర్యటనకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

పంట నష్టం ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్, కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతాల్లో సీఎం పర్యటన సాగుతుందని సమాచారం. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మిగతా జిల్లాల్లో తర్వాత పర్యటిస్తారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News