: తెలంగాణ ఇవ్వాల్సిందే: పీఏ సంగ్మా


తెలంగాణ, విదర్భలను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా డిమాండ్ చేశారు. బుందేల్ ఖండ్, హరిత ప్రదేశ్ తదితర రాష్ట్రాల డిమాండ్లపై రెండో ఎస్సార్సీ వేయాలని సూచించారు. దీర్ఘకాలంగా ఉన్న తెలంగాణ, విదర్భ ప్రాంతప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాను అనుకూలమని చెప్పారు. అమెరికాలో దాదాపు 50 రాష్ట్రాలున్నాయని ఆయన గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News