: పార్టీలతో పండగ చేసుకున్న టీమిండియా


ఛాంపియన్స ట్రోఫీ గెలిచిన ఆనందంలో టీమిండియా పండగ చేసుకుంది. చివరి సారిగా జరుగుతున్న టోర్నీలో టైటిల్ సాధిస్తామో లేదోనన్న టెన్షన్ తో ఇంగ్లాండ్ లో అడుగుపెట్టిన భారత జట్టుకు తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఓటమి నిరాశ కలిగించింది. దీంతో తరువాత మ్యాచ్ నుంచి జూలు విదిల్చిన టీమిండియా, ఒక్క మ్యాచ్ కూడా ఓటమిపాలు కాకుండా అద్వితీయ ఆటతీరుతో టైటిల్ సాధించి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో 30 కూడా నిండని యువ భారత క్రికెట్ జట్టులో ఉత్సాహం ఉరకలెత్తింది. ఈ నేపథ్యంలో, టైటిల్ అందుకున్నది లగాయతు తెల్లవార్లూ టీమిండియా పార్టీ చేసుకుంది. వేడుకలకు కోహ్లీ సారధ్యం వహించగా, వివాదాలు దరి చేరకుండా 'మిత్రులకు దగ్గరగా ఉండండి పర్లేదు కానీ మిత్రురాళ్లకు దూరంగా ఉండాల'ని ధోనీ సూచించాడట.

  • Loading...

More Telugu News