: లైంగిక హింసను నిరోధించండి: ఏంజెలినా జోలీ
యుద్ధ ప్రాంతాలలో లైంగిక హింసను నిరోధించాలని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక రాయబారి, నటి ఏంజెలినా జోలీ సమితి భద్రతా మండలిని కోరింది. ప్రతీ దేశం లైంగిక హింసను ఎదుర్కొంటోంది, దానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఆయా దేశాలపై ఉందని పేర్కొంది. ఇందుకు భద్రతామండలి తనవంతు సహకారం అందించాలని ఆమె కోరింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మహిళలు, శాంతి, భద్రత అనే అంశాలపై రాయబారి హోదాలో ఏంజెలినా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు లైంగిక హింసకు అవకాశం కల్పిస్తున్నాయని ఆమె అన్నారు. దీనికి ముగింపు పలకాలని ఆమె కోరారు.