: రాన్ బ్యాక్సీ నకిలీ ఔషధాలపై పిటిషన్ కొట్టివేత
నకిలీ ఔషధాలు తయారు చేసి విక్రయిస్తున్నందున ఫార్మా కంపెనీ రాన్ బ్యాక్సీ లైసెన్స్ రద్దు చేసి డైరెక్టర్లను విచారించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టివేసింది. ఈ కేసులో సాక్ష్యాధారాలే లేవని ధర్మాసనం స్సష్టం చేసింది. నకిలీ ఔషధాలు తయారు చేసిందంటూ రాన్ బాక్సీ కంపెనీపై అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. యుఎస్ఎఫ్ డీఏ 50కోట్ల డాలర్ల జరిమానా కూడా విధించింది. ఈ నేపథ్యంలో ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వార్తలు కాకుండా విచారణకు సాక్ష్యాలు అవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది.