: ఉత్తరాఖండ్ లో వర్షాలే వర్షాలు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్, కేదార్ నాథ్ పరిసరాలలో రాత్రి నుంచీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సహాయక కార్యక్రమాలు ఆగిపోయాయి. హెలికాప్టర్లు పూర్తిగా నిలిచిపోయాయి. రానున్న 24 గంటల్లో చమోలి, ఉత్తరకాశీ, డెహ్రాడూన్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణం సహకరించకపోవడంతో బద్రీనాథ్ లో ఉన్న 9,000 మంది యాత్రీకులు అక్కడే ఉండిపోయారు. ప్రస్తుతానికి వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని సమాచారం. అయితే, వర్షాలలోనూ సైనికులు తమ సేవలను కొనసాగిస్తున్నారు.