: ప్రజలకు సమాధానం చెప్పండి: బ్రదర్ అనిల్ ను నిలదీసిన వీహెచ్
నాలుగు ఎకరాల భూమిని ఆక్రమించుకున్న వ్యవహారంలో వస్తున్న ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్ ను కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు నిలదీశారు. తనపై వస్తున్న తీవ్ర ఆరోపణలకు అనిల్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు.
హైదరాబాదులో అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద మాట్లాడిన వీహెచ్, మణికొండ భూబాధితులకు చేసిన అన్యాయానికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. తనకు వీలు కుదిరితే రేపు ఆ ప్రాంతంలో పర్యటిస్తానని హనుమంతరావు చెప్పారు. నీతి, నిజాయతీలు ఉంటే తనపై వస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని అనిల్ రుజువు చేసుకోవాలని సూచించారు.