: ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్
ఇంటర్మీడియట్ తొలి ఏడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేశారు. పరీక్షల్లో మొత్తం 66.64 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 84 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో కృష్ణాజిల్లా ఉండగా, 50 శాతంతో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్‌కు జూలై 3 చివరితేదీగా అధికారులు తెలిపారు.