: ఢిల్లీలో ముదురుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్యుల వివాదం


ఉత్తరాఖండ్ బాధితులకు వైద్యసహాయం చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్టు నుంచి వెళ్లిన వైద్యులకు ఢిల్లీలోని ఏపీ భవన్లో అనుమతి లభించని సంగతి తెలిసిందే. ఇప్పుడా వివాదం మరింత ముదురుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన వైద్యసహాయం లభిస్తున్న నేపథ్యంలో మరే ఇతర వైద్యుల అవసరం లేదని ఏపీ భవన్ అధికారులు ఎన్టీఆర్ ట్రస్టు వైద్యులను అనుమతించలేదు. చేసేదిలేక ఏపీ భవన్ ఎదురుగా శిబిరాన్ని తెరిచారు ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్యలు. ఏపీ భవన్ అధికారులు దీనిని కూడా అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలకు వాగ్వాదం జరిగి, తోపులాటలకు దారితీసింది. దీంతో ట్రస్టు వైద్యులు తీసుకెళ్లిన మందులు చాలావరకు ధ్వంసమయ్యాయి. ఏపీ భవన్ అధికారుల తీరుపై వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News