: రణబీరా మజాకా...!


బిగ్ బీ అమితాబ్ లా పేరు తెచ్చుకోవాలని వుందని బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ మనసులో మాట బయటపెట్టేశాడు. తనకు ప్రపంచంలో అత్యంత అందగాడు అనిపించుకోవాలని లేదన్న రణబీర్, అందుకు తానేమీ మోడల్ ను కాదని, నటుణ్ణని గుర్తు చేశాడు. అమితాబ్ అందగాడిగా రికార్డుల కెక్కలేదని, కానీ ప్రజల్లో అయనంటే ఉన్న గౌరవం, ఆయనపట్ల ఉన్న ఆప్యాయత, ఆదరణ అపారమని, అలాంటి గుర్తింపు సంపాదించగలగాలి కానీ, అవసరం లేని ట్యాగ్ లు వద్దని అభిప్రాయపడ్డాడు. ఈ లెక్కన అమితాబ్ స్థానాన్ని కోరుకుని తనకేం కావాలో స్పష్టం చేశాడు. రణబీరా మజాకా...

  • Loading...

More Telugu News