: ఉత్తరాఖండ్ కు మరోసారి వరద హెచ్చరిక
ఉత్తరాఖండ్ ను మరోసారి వరదలు ముంచెత్తనున్నాయి. నేటి నుంచి రానున్న మూడు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. ఈసారి దాదాపు 25 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసే అవకాశముందని, వీటి కారణంగా మరోసారి భారీ వరదలు ముంచెత్తే అవకాశముందని తెలిపింది. నిన్నటి వరకు ఇక్కడ 39.2 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. సాధారణంగా ఉత్తరాఖండ్ లో ఎప్పుడూ కురిసే వర్షపాతానికి ఇది 275 శాతం ఎక్కువ అని వాతావరణ శాఖ తెలిపింది.