: కొత్త ఎక్సైజ్ పాలసీ రెడీ... మరి మందు సరఫరా ఎలా?
ఎక్సైజ్ విధానం ప్రకటిస్తూ రాష్ట్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పుడున్న స్థాయిలోనే 6,596 మద్యం చిల్లర దుకాణాలను కొనసాగించాలని నిర్ణయించింది. 10 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో వార్షిక లైసెన్స్ ఫీజు 32.5 లక్షలుగా నిర్ణయించింది. అలాగే 10 వేల నుంచి 50 వేలు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు 34 లక్షలుగా నిర్ణయించింది. 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో 42 లక్షల రూపాయలుగా నిర్దేశించింది.
3 లక్షల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో 46 లక్షల రూపాయలు, 5 లక్షల నుంచి 20 లక్షలకు పైబడిన జనాభా ప్రాంతాల్లో 64 లక్షలు రూపాయలు కాగా, 20 లక్షలకు పైబడి జనాభా ఉన్న ప్రాంతాల్లో 1.04 కోట్ల లైసెన్స్ ఫీజును ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, బెల్టు షాపులన్నీ దశలవారీగా ఎత్తేస్తామన్న సీఎం నిర్ణయంతో, రాబోయే ఎన్నికల వేళ మందు సరఫరా ఎలా బాబూ? అని రాజకీయ పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి.