: బాబుపై ఎఫ్ బీఐ దర్యాప్తు చేయాలి: జనక్ ప్రసాద్
బాబు అమెరికా పర్యటనపై ఎఫ్ బీఐతో దర్యాప్తు చేయించాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన హైదరాబాదులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ, బాబు అమెరికా పర్యటన ఎన్నికల నిధుల సేకరణ కోసమా? లేక నల్లధనం తరలించడానికా? అని ప్రశ్నించారు. జడ్ ప్లస్ భద్రతను సైతం ప్రక్కనపెట్టి చంద్రబాబు అమెరికాలో ఏం చేశారని అడిగారు. ఎన్టీఆర్ ట్రస్టు పేరిట సాగుతున్న వసూళ్లపై ఎఫ్ బీఐ చేత దర్యాప్తు జరపాలని అమెరికాకు లేఖ రాస్తామని తెలిపారు. గత పర్యటనలో 300 మిలియన్ డాలర్లు సేకరించారని ఆరోపణలు వచ్చిన బాబు, ఈసారి 500 మిలియన్ డాలర్లు సేకరించారా? అని జనక్ ప్రసాద్ ప్రశ్నించారు.