: ప్రభుత్వం వివరాలందిస్తే 20 రోజుల్లో స్థానిక ఎన్నికలు: రాష్ట్ర ఎన్నికల సంఘం
స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ, సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో... ప్రభుత్వం వివరాలందిస్తే 20 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రమాకాంత్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లనే అమలు చేయాలని సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇంకా తమకు అందజేయలేదని రమాకాంత్ రెడ్డి తెలిపారు.