: కేదార్ నాథ్ యాత్రీకులు 2,634 మందే!
రాష్ట్రం నుంచి కేదార్ నాథ్ యాత్రకు వెళ్లిన వారు 2,634 మందేనని ప్రభుత్వం ప్రకటించింది. వీరంతా రాష్ట్రానికి చెందిన 20 జిల్లాల నుంచి వెళ్లారని తెలిపారు. వీరిలో దాదాపు 1800 మంది యాత్రీకులు తిరిగి ఇళ్లకు చేరుకున్నట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. వీరిలో అత్యధికంగా హైదరాబాద్ నుంచి 922 మంది వెళ్లగా, విశాఖ నుంచి 661 మంది యాత్రకు వెళ్లారు.