: గొప్పమనసు చాటుకున్న టీడీపీ
టీడీపీ దేశంలోని పార్టీలన్నింటికీ ఆదర్శంగా నిలిచింది. తమ రాష్ట్ర బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా విమానాన్ని ఏర్పాటు చేసి తమ గొప్పమనసు చాటుకుంది. ఉత్తారఖండ్ లో చిక్కుకున్న తెలుగు యాత్రీకులను హైదరాబాద్ తీసుకుని వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. వరదబాధితుల సహాయార్ధం హైదరాబాదులో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన టీడీపీ, బాధితుల బంధువులు 040 30699999, 040 39156425 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించింది. పార్టీ యంత్రాంగం ద్వారా సికింద్రాబాద్, ఖాజీ పేట, విజయవాడ రైల్వేస్టేషన్లలో సేవా కేంద్రాలు ఏర్పాటు చేసింది.