: సోనీ ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచ్
సోనీ కంపెనీ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ వాచ్ ను ఆవిష్కరించనుంది. ఈ నెల 26న చైనాలోని షాంఘై నగరంలో ప్రారంభమయ్యే మొబైల్ ఏసియా ప్రదర్శనలో కొత్త స్మార్ట్ వాచ్ ను ఆవిష్కరించనుందని సమాచారం. వాటర్ ప్రూఫ్, బ్లూటూత్ తదితర సదుపాయాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. ప్రపంచంలో మొట్టమొదటి స్మార్ట్ వాచ్ ను 2007లో సోనీయే విడుదల చేసింది. దీని ధరను అప్పట్లో 100 అమెరికన్ డాలర్లుగా పేర్కొంది. స్మార్ట్ ఫోన్ తయారీపై ఎల్జీ, యాపిల్, గూగుల్ కూడా పరిశోధనలు జరుపుతున్నాయి.