: మనసున్న మారాజు శిఖర్ ధావన్
చాంపియన్స్ ట్రోఫీలో బ్యాటింగ్ తో చెలరేగిపోయి అద్భుత ఆటతీరును ప్రదర్శించిన భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తన మంచి మనసును చాటుకున్నాడు. తనకు లభించిన మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును ఉత్తరాఖండ్ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. "నా ఆటతీరును వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి అంకితం చేయాలనుకుంటున్నాను. వారి కోసం ప్రార్థిస్తున్నాను" అని ధావన్ ప్రకటించాడు.
ఇక యువరాజ్ సింగ్ తన ఆటతీరును ఢిల్లీ అత్యాచారానికి బలైపోయిన జ్యోతిసింగ్ కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించగా.. మనోజ్ తివారీ వెస్టిండీస్ పై సాధించిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కోల్ కతా ఏఎంఆర్ఐ ఆస్పత్రిలో అగ్ని ప్రమాద బాధితులకు అంకితం చేశాడు.