: చికెన్‌ తింటే మంచిదే


చికెన్‌ తింటే ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు పరిశోధకులు. చికెన్‌, చేపలు తినేవారికి పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువని తాజా అధ్యయనంలో తేలింది. యుక్తవయసులో మాంసాహారం తీసుకున్న వారిలో వయసు మీరిన తర్వాత పెద్దపేగుకు సంబంధించిన క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.

సుమారు ఇరవై వేల మంది మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో వారి యుక్త వయసులో ఎక్కువగా కోడిమాంసం తిన్నవారిలో పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్‌ వచ్చే ముప్పు తక్కువగా ఉందని, ఇతరులతో పోల్చుకుంటే అధికంగా చికెన్‌ తినేవారిలో ఈ క్యాన్సర్‌ వచ్చే ముప్పు నలభై శాతం తక్కువగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని ముఖ్య అధ్యయన కర్త కేథరినా తెలిపారు. అయితే గతంలో మాంసాహారం తిన్నవారిలో క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అయినా మాంసాహారంలో చికెన్‌ ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్‌ ముప్పు నుండి బయటపడవచ్చని ఈ పరిశోధన చెబుతోంది.

  • Loading...

More Telugu News