: మహిళలకు నిర్ణయ శక్తి తక్కువట!


మహిళలు అన్ని రంగాల్లోను ముందుండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆర్ధిక పరంగా మాత్రం వారికి నిర్ణయ శక్తి తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. పొదుపు, పెట్టుబడులకు సంబంధించి ఎక్కువ శాతం మహిళలు పురుషులపై ఆధారపడుతున్నారని దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. మహిళల్లో ఎనభై శాతం మంది మంచి ఉద్యోగం చేస్తూ మంచి హోదాలో ఉన్న వారు కూడా డబ్బు విషయంలో పక్కవారి సలహాలను పాటిస్తున్నారట.

అయితే పెళ్లికాని మహిళలు, వితంతువులను ఇందులోనుండి మినహాయించవచ్చని ఈ పరిశోధకులు చెబుతున్నారు. పెళ్లయిన మహిళల్లో అయితే మరీ తక్కువమంది అనగా పదమూడు శాతం మంది మాత్రమే తమ సొంత నిర్ణయాలతో ఆర్ధిక పరమైన విషయాల్లో ముందుకెళ్తున్నారట. ఇక విడాకులు తీసుకున్న వారిలో 73 శాతం, అలాగే వితంతువుల్లో 68 శాతం మంది తమ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈ అధ్యయనంలో తేలింది. ఇంకా ఇరవై శాతం మంది మహిళలకు డబ్బు విషయంలో నిర్ణయాలు తీసుకునే అవకాశాలను అసలు కుటుంబంలో ఇవ్వడంలేదని తేలింది. ఈ అధ్యయనంలో 21 నుండి 60 సంవత్సరాల వయసుకల మహిళలు సుమారు ఐదు వేలమంది పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News