: బద్రినాథ్ లో భారీ వర్షం
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్నవారి రక్షణ చర్యలకు అడ్డంకి ఎదురయింది. దెబ్బతిన్న ప్రాంతాల్లోనే మళ్లీ భారీ వర్షం పడుతుండడంతో సహాయక చర్యలు ఆగిపోయాయి. ప్రతికూల వాతావరణంతో హెలికాప్టర్లు సహస్రధారకు తిరిగిరావాల్సి వచ్చింది. ఈ ఉదయం నుంచి పడుతున్న వర్షం కారణంగా సహాయక చర్యలకు చాలా ఇబ్బంది కలుగుతోంది.