: పాక్ నటి ముఖంపై యాసిడ్
పాకిస్తాన్ కు చెందిన కథానాయిక బుష్రాపై రాత్రి యాసిడ్ దాడి జరిగింది. ఆమె పడుకున్న ఇంట్లోనే ఈ దారుణం జరిగింది. నౌష్రే టౌన్లోని తన సొంత ఇంట్లో బుష్రా పడుకొని ఉండగా, గుర్తుతెలియని వ్యక్తి గోడదూకి ఇంట్లో ప్రవేశించాడు. నిద్రపోతున్న బుష్రా ముఖంపై యాసిడ్ వేసి పారిపోయాడు. ముఖంపై 30 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది బుష్రా. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.