: దేశమంటే ఒకే మతం కాదు: రాజ్ నాథ్ సింగ్
జాతి నిర్మాణం ఒక్క మతంతోనే సాధ్యపడదని, అన్ని మతాలూ జాతి నిర్మాణానికి సాయపడతాయని భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 'దేశ ప్రజల సంతోషం కోసం మేం పనిచేస్తున్నాం. ఒకే మతంతో జాతి సమగ్రత సాధ్యపడదు. ప్రతి భారతీయుడి సహకారం ఉండి తీరాల్సిందే. బీజేపీ అధ్యక్షుడిగా నేనో మాట చెబుతున్నా. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఏ ముస్లిం వ్యక్తికైనా హాని కలిగితే దానికి నేనే జవాబుదారి' అంటూ భిన్నమైన వ్యాఖ్యలు చేశారు రాజ్ నాథ్ సింగ్.