: రణబీర్ కు అసిస్టెంట్ ను కాదు.. తండ్రిని: రిషికపూర్
రణబీర్ కపూర్ గురించి గొప్పలు చెప్పడానికి తాను ఆయన పర్సనల్ అసిస్టెంట్ కాదని, తండ్రినని బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ అన్నారు. రణబీర్ ఎదుగుదల గురించి అభిప్రాయమేంటని విలేకరులు అడిగిన ప్రశ్నకు రిషికపూర్ ఇలా సమాధానమిచ్చాడు. 'తన జీవితం తన ఇష్టం. తనకు నచ్చినట్టుగా మలచుకుంటాడు. తల్లిదండ్రులమైన మేము ఏమీ చెప్పాలనుకోం. మేమేదైనా చెబితే రణబీర్ ఒత్తిడికి గురవుతాడు. జీవితంలో ఎలా పైకి రావాలో రణబీర్ కు తెలుసు. మా సాయం అవసరం లేదు' అంటూ తేల్చేశారు రిషి కపూర్.