: హెలికాప్టర్ల ఒప్పందంపై చర్చకు సిద్ధం: ప్రధాని
అగస్టా హెలికాప్టర్ల ఒప్పందానికి సంబంధించి తాము ఏమీ దాచడం లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించి అన్ని అంశాలను చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. హెలికాప్టర్ల కుంభకోణంపై పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, సభను స్తంభింపజేస్తామంటూ ప్రతిపక్షాల నుంచి వస్తున్న ప్రకటనలపై ప్రధాని ఢిల్లీలో ఇలా స్పందించారు.