: ఉవ్విళ్లూరుతున్న భారత జట్టు


భారత జట్టుకు ఏమైందో ఏమో కానీ, ఐసీసీ వరల్డ్ కప్ కైవసం చేసుకున్నప్పటి నుంచీ చక్కని ఆటతీరుతో మేం నిజంగా చాంపియన్లమే అని నిరూపిస్తోంది. అందుకు నిదర్శనంగా వరల్డ్ కప్ తర్వాత దాదాపుగా భారత జట్టు విజయాలనే నమోదు చేసుకుంటూ వస్తోంది. ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ కప్ నూ సొంతం చేసుకుని మరోసారి భారత జట్టు తన సత్తా చూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అదే పట్టుదలతో ఈ రోజు ఫైనల్ మ్యాచులో ఆదిత్య జట్టు ఇంగ్లండ్ ను ఓడిండానికి సమయాత్తం అయింది. ఎడ్జ్ బాస్టన్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరోవైపు ఇంగ్లండ్ జట్టు కూడా ఎలాగైనా ఫైనల్లో నెగ్గి తమ పరువు నిలుపుకోవాలని, చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుని పరాజయాలకు ముగింపు పలకాలని భావిస్తోంది.

  • Loading...

More Telugu News