: హైదరాబాద్ అందరి సొత్తు: మంత్రి శైలజానాథ్


రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అందరిదీ అనీ, ఇక్కడ ఎవరైనా సమావేశాలు నిర్వహించుకోవచ్చని మంత్రి శైలజానాథ్ నొక్కి చెప్పారు. ఏపీఎన్జీవోలు హైదరాబాద్ లో సమావేశం నిర్వహించరాదని తెలంగాణ వాదులు అభ్యంతరం చెప్పడం సరికాదని మంత్రి పేర్కొన్నారు.

బలహీన వర్గాలతో పాటు బడుగులు కూడా ఐక్యంగా ఉన్నప్పుడే రాష్ట్రం సమైక్యంగా ఉండడం సాధ్యమని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. ఎన్జీవోలు తమ సమస్యలను ప్రభుత్వం ముందుంచితే పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News