: అగ్నిపర్వతానికి అంతర్జాతీయ గుర్తింపు
యునెస్కో వారసత్వ సంపదల్లో జపాన్ పర్వతరాజం పుజిసాన్‌కు చోటు దొరికింది. జపాన్‌లోని ఎత్తైన పర్వతాల్లో పుజిసాన్ ఒకటి. ఇది ఒక విలుప్త అగ్నిపర్వతంగా చెప్పవచ్చు. చివరిసారిగా ఈ పర్వతం మూడు వందల ఏళ్ల క్రితం విస్ఫోటనం చెందినట్లు సమాచారం. ఆ తర్వాత ఈ పర్వతం పేలే సూచనలు ఇప్పటి వరకూ కనిపించలేదు. ఈ పర్వతం సుమారు 3,776 మీటర్ల ఎత్తులో శంఖాకారంతో ఉంటుంది. జపాన్ రాజధానికి నైరుతి దిశగా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అగ్ని పర్వతానికి యునెస్కో వారసత్వ సంపదల్లో ఒకటిగా చోటు దక్కింది. దీంతో యునెస్కో వారసత్వ జాబితాలో చేరిన జపాన్‌కు చెందిన ప్రదేశాల సంఖ్య 17కు చేరుకుంది. ప్రస్తుతం యునెస్కో 37వ వార్షిక సమావేశాలు నామ్‌ఫెన్‌లో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పుజిసాన్‌కు వారసత్వ సంపద గుర్తింపునిస్తున్నట్టు యునెస్కో ప్రకటించింది.