: ఉత్తరాఖండ్ కు మళ్లీ వర్షభయం
వరదలతో సర్వనాశనమైన ఉత్తరాఖండ్ ను ప్రమాదం వదలిపోలేదు. ఉత్తరాఖండ్లో మళ్లీ రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడే ప్రమాదం ఉంది. ఈ విషయం తెలిసి వరద బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధితులను వీలైనంత త్వరగా కాపాడేందుకు సైన్యం ఏర్పాట్లు చేస్తోంది. మరిన్ని హెలికాప్టర్లను వరద ప్రాంతాలకు తరలించనున్నారు.