: ఉత్తరాఖండ్ బాధితులకు పవన్ కల్యాణ్ విరాళం
ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం హీరో పవన్ కల్యాణ్ 20 లక్షల రూపాయల విరాళం అందించారు. ఉత్తరకాశీ పుణ్యక్షేత్రం దర్శనార్ధం ఉత్తరాఖండ్ కు దేశ నలుమూలల నుంచి వచ్చిన అనేకమంది వరదల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారం 556 మంది చనిపోయారు. వందలాది మంది ఆచూకీ తెలియడం లేదు.