: గ్రేటర్ విజయవాడ కోసం టీడీపీ ధర్నా
గ్రేటర్ విజయవాడను ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ తన ఉద్యమాన్ని ఉద్ధృతం చేసింది. ఈ రోజు వందలాది టీడీపీ కార్యకర్తలు విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. గ్రేటర్ విజయవాడను ఏర్పాటు చేస్తానని నాలుగేళ్లుగా స్థానిక ఎంపీ లగడపాటి రాజగోపాల్ మభ్యపెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే విజయవాడ నగరానికి గ్రేటర్ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.